Telangana Elections 2018 : చంద్రబాబు నాయుడు కేసీఆర్‌ కు గురువు : మోడీ | Oneindia Telugu

2018-12-04 352

With elections in Telangana just days away, Prime Minister Narendra Modi addressed a public meeting in Hyderabad. PM Modi said Telangana is witnessing is ‘dynastic politics’. He also said, out of all the parties contesting elections, only BJP values democratic ideals.
#TelanganaElections2018
#modi
#kcr
#congress
#trs
#publicmeeting


కేసీఆర్‌ను ఎన్నుకొని తెలంగాణ ప్రజలు అయిదేళ్లు నష్టపోయారని, మరోసారి నష్టపోవద్దని ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం అన్నారు. ఎల్బీనగర్‌లో జరిగిన బీజేపీ ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ పైన నిప్పులు చెరిగారు. మత రిజర్వేషన్లు అనడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యూపీఏ 1, యూపీఏ 2లు మేడం రిమోట్ కంట్రోల్ చేతిలో ఉన్నాయని సోనియా గాంధీని ఉద్దేశించి మోడీ అన్నారు. బీజేపీ పాలన మాత్రం ప్రజల పాలన అన్నారు. విపక్షాలన్నీ కలిసి ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తాము ఒక్క రక్తపు చుక్కపడకుండా మూడు రాష్ట్రాలు ఇచ్చామని చెప్పారు. కేసీఆర్ పాలనలో అయిదేళ్ల సమయం వృథా అయిందని చెప్పారు.

Videos similaires